News April 7, 2025
రామప్పకు 812 ఏళ్లు.. కీ చైన్ చూశారా?

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం నిర్మించి 812 ఏళ్లు పూర్తైన సందర్భంగా సేవా టూరిజం కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రామప్పను ప్రమోట్ చేయడానికి కీ చైన్ విడుదల చేశారు. కీ చైన్ బిల్లపై ఓవైపు రామప్ప ఆలయం, మరోవైపు నాగిని నృత్యం చేస్తున్న చిత్రాన్ని ముద్రించారు. ఈ కీ చైన్ ఎంతో ఆకర్షణయంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? రామప్పను దర్శించి కీ చైన్ తీసుకోండి.
Similar News
News November 14, 2025
‘జూబ్లీహిల్స్’ ప్రస్థానమిదే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి మాగంటి గోపినాథ్(టీడీపీ, బీఆర్ఎస్) వరుసగా మూడు సార్లు గెలిచారు. ఈ ఏడాది జూన్లో ఆయన అనారోగ్యంతో చనిపోగా ఈ నెల 11న ఉపఎన్నిక జరిగింది. ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది.
News November 14, 2025
అనకాపల్లి: ‘డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలి’

అనకాపల్లి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి గల సంస్థలు, ట్రస్టులు,సొసైటీలు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి మనోహర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో 10 లక్షల జనాభాకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన డీపీఆర్ నకలు, ఇతర అటాచ్మెంట్లు అందజేయాలన్నారు. దరఖాస్తు చేసే సంస్థలకు మూడేళ్ల ఆడిట్ రిపోర్ట్ ఉండాలన్నారు.
News November 14, 2025
తిరుమల: సాఫీగా ఇంటర్వ్యూలు

TTD వేద పారాయణదారుల పోస్టుల ఇంటర్వ్యూల్లో అకడమిక్ అబ్జర్వర్ తీరు గత మూడు రోజులుగా చర్చకు దారి తీసింది. ఈ మెయిల్స్ ద్వారా ఆయనపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయం Way2Newsలోనూ రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. అబ్జర్వర్ పని మాత్రమే చేయాలని, ఇతర పనులు చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో గురువారం సాఫీగా ఇంటర్వ్యూలు జరిగాయి.


