News August 26, 2024

రామప్పను సందర్శించిన మంత్రి, కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టిఎస్.దివాకర సోమవారం సాయంత్రం రామప్పను సందర్శించారు. మంత్రి ముందస్తు ఏర్పాట్ల పనులను పరిశీలించారు.

Similar News

News December 1, 2024

నెక్కొండ: విఫలమైన ఆన్‌లైన్ ప్రేమ.. యువకుడు సూసైడ్

image

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెక్కొండ మండలంలో జరిగింది. అప్పలరావుపేటకి చెందిన వినయ్ (25) HYDలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతనికి ఆన్‌లైన్‌లో యువతి పరిచయం కాగా..అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. దీంతో యువకుడు 5రోజుల క్రితం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News December 1, 2024

ములుగు: ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ

image

ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏటూరునాగారం మండలానికి సమీప అడవుల్లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులు తెలంగాణలోకి తలదాచుకునేందుకు వచ్చారా? లేక రేపటి నుంచి జరగనున్న వారోత్సవాల కోసం తమ ఉనికి చాటుకునేందుకు వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

News December 1, 2024

ప్రజాపాలన విజయోత్సవాల్లో WGL ఎమ్మెల్యే, HNK కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన 2k రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు.