News March 5, 2025

రామప్ప: ఈ బావి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

image

వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల రామప్ప ఆలయ ఆవరణలో ఉన్న కాకతీయుల కాలంనాటి బావి నేటి వరకు చెక్కుచెదరకుండా ఉంది. సుమారు 800 ఏళ్ల క్రితం తవ్విన ఈ బావి గోడలు పొడవైన, వెడల్పైన శిలలతో నిర్మించారు. ఈ బావిలోని నీటిని తాగితే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. రామప్ప ఆలయ నిర్మాణానికి వాడిన ఇటుకలు ఈ నీటిలో వేస్తే తేలుతాయి. రామప్ప సందర్శించిన పర్యాటకులు ఈ బావిని చూసి మంత్రముగ్ధులవుతారు.

Similar News

News March 21, 2025

ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్‌ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్

image

జవహర్‌‌నగర్ పరిధిలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ (ACDS) బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ విద్యార్థుల కోసం 19వ స్నాతకోత్సవ వేడుకను నిర్వహించింది. ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. ప్రిన్సిపల్ డా.మమతా కౌశిక్ కళాశాల నివేదికను సమర్పించారు. ACDS ఛైర్మన్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గ్రాడ్యుయేట్లు ఆదర్శవంతంగా పనిచేయాలన్నారు.

News March 21, 2025

BRS వల్ల ఒక జనరేషన్‌ నాశనం: భట్టి

image

TG: రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను BRS నాశనం చేసిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లపాటు ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా ముందే లాక్కుంది’ అని ఫైర్ అయ్యారు.

News March 21, 2025

అనకాపల్లి: పదవ తరగతి పరీక్షకు 132 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 132 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరుకావాల్సి ఉండగా 20,677 మంది హాజరైనట్లు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు 40 మంది హాజరుకావాల్సి ఉండగా కేవలం ఐదుగురు మాత్రమే హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు.

error: Content is protected !!