News September 23, 2024

రామప్ప దేవాలయం సమీపంలో గుప్తనిధుల తవ్వకం

image

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పక్కనున్న గొల్లగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు గుర్తించారు. గుడి పైకప్పు ధ్వంసం చేసి, లోపల తవ్వకాలు చేపట్టి, శిల్పాలను కూడా ధ్వంసం చేశారు. గుడి వద్ద దుండగులు ఉపయోగించిన నిచ్చెనతో పాటు పలు వస్తువులు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న పురావస్తు శాఖ అధికారులు వెంకటాపురం ఠాణాలో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 20, 2025

అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: వరంగల్ కలెక్టర్

image

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

News October 19, 2025

వరంగల్: 23 వరకు గడువు.. 27న డ్రా

image

బీసీ బంద్, బ్యాంకుల బంద్‌తో మద్యం షాపునకు దరఖాస్తులు వేసే ఉత్సాహకులు రాలేకపోయామని, వారు చేస్తున్న విజ్ఞప్తి మేరకు దరఖాస్తులు స్వీకరించడానికి గడువు పెంచుతున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న డ్రా తీయనున్నట్లు చెప్పారు.

News October 17, 2025

వరంగల్: పంటల కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

image

ధాన్యం, పత్తి, మక్క పంటల కొనుగోలు ప్రక్రియపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్షించారు. రైతుల ప్రయోజనాల కోసం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరగాలని, కేంద్రాల సౌకర్యాలు, తూక యంత్రాలు, గోదాములు, సమాచారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.