News August 7, 2024
రామప్ప హుండీ ఆదాయం రూ.3.95లక్షలు
ప్రపంచ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ హుండీ లెక్కించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు అనిల్ తెలిపారు. ఆలయ ఆదాయం రూ.3,95,140లు వచ్చినట్లు పేర్కొన్నారు. రూ.3,76,535ల నోట్లు, రూ.18,605ల నాణాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీనివాస్, అర్ఐ రమేశ్, అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్, ఏఎస్సై కిష్టయ్య, పురావస్తు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News September 12, 2024
వరంగల్ జిల్లాకు ముఖ్యఅతిథిగా పొంగులేటి
సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవం’గా ఉత్సవాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం కార్యక్రమాలు ఇతర సంస్కృతి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర I & PR మంత్రి శ్రీనివాస్ హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
News September 11, 2024
అడవుల్లో ప్రకృతి ప్రకోపం అత్యంత బాధాకరం: కేటీఆర్
అడవుల్లో ప్రకృతి ప్రకోపం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మానవ తప్పిదాల వల్ల పర్యావరణంలో ఇలా ఎన్నడూ లేని మార్పులు ఏర్పడుతున్నాయని, పర్యావరణాన్ని రక్షిస్తూ.. ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ములుగు జిల్లా అటవీ ప్రాంతాన్ని భారీ చెట్ల పెంపకంతో సంరక్షించాలని కేటీఆర్ కోరారు.
News September 11, 2024
రామప్ప దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది: సీతక్క
రామప్ప దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రామప్ప కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పేలా అభివృద్ధి పనులను చేపట్టాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.