News April 10, 2024
రామభద్రపురం: నిన్న టీడీపీ లోకి… నేడు వైసీపీ లోకి

మండల పరిధిలోని ఆరికతోట గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు మాజీ సర్పంచ్ పెంకి భీమయ్య ఆధ్వర్యంలో వైసీపీలో చేరాయి. స్థానిక మండల వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వ్యక్తులు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేసి కండువాలు వేయించి పార్టీలో చేర్చారని చెప్పారు.
Similar News
News March 21, 2025
VZM: సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం దరఖాస్తుల తేదీని ఈనెల 22వరకు పొడిగించినట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ADR మీడియేషన్ కేంద్రంలో 2 పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన (SC, OC) నియామకం కోసం మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను జిల్లా కోర్ట్ భవనంలో ఉన్న న్యాయ సేవల కేంద్రంలో సమర్పించాలన్నారు.
News March 21, 2025
VZM: ఇంగ్లిష్ పరీక్షకు 98 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో 119 పరీక్షా కేంద్రాలలో జరుగుతున్న 10 వతరగతి పరీక్షలలో శుక్రవారం ఇంగ్లిష్ పరీక్షకు 98 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. 22,846 విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 22,748 మంది పరీక్ష రాశారన్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయని.. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు.
News March 21, 2025
మానాపురం ROB పనులపై కలెక్టర్ సీరియస్

మానాపురం ROB నిర్మాణం ఆలస్యం అయినందున కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నోటీసు అందిన రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని, లేనిచో చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పనుల ఆలస్యం వలన ట్రాఫిక్ సమస్యతో పాటు పబ్లిక్‌కు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు.