News March 30, 2025
రామయ్య కల్యాణానికి CMకు ఆహ్వానం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న రాములోరి కళ్యాణం జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కల్యాణోత్సవానికి రావాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఆదివారం వారు తాడేపల్లిలోని CM క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబును కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు.
Similar News
News April 3, 2025
కడప వాసులకు గర్వకారణం: తులసిరెడ్డి

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గాలి నాణ్యత నివేదికలో కడప నగరం మొదటి స్థానంలో ఉండటం హర్షణీయమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన వేంపల్లిలో మాట్లాడారు. 42 పాయింట్లతో, కడప నగరం రాష్ట్రంలో అత్యంత క్లీన్ ఎయిర్ నగరంగా ఎంపిక కావటం సంతోషమన్నారు, ఇది కడప వాసులకు గర్వకారణమన్నారు. 52 పాయింట్లతో నెల్లూరు, 120 పాయింట్లతో విశాఖ చివరి స్థానంలో ఉండటం దారుణం అన్నారు.
News April 3, 2025
కడప జిల్లాలో యూట్యూబర్స్‌పై కేసు నమోదు

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఇద్దరు యూట్యూబర్స్‌పై కేసు నమోదు అయింది. సీఐ హేమ సుందర్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శంకర్ రాజు, సత్యనారాయణ రెడ్డి అనే యూట్యూబర్స్, జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం డబ్బుల కోసం బెదిరించారని పోలీసులకు కోడూరు రేంజ్ పీఏ శ్యాంసుందర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
News April 2, 2025
కడప: వైవీయూ దూర విద్యా పీజీ ఫలితాలు విడుదల

వైవీయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యు కేషన్ పీజీ 1, 2 సెమిస్టర్ల ఫలితాలను సీడీవోఈ డైరెక్టర్ ప్రొ. కె. కృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ డా. ఎం. శ్రీధర్ బాబుతో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ,, 1, 2వ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 08 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించామన్నారు. ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను అభినందించారు.