News April 3, 2025

రామయ్య భక్తుల కోసం ‘క్యూఆర్ కోడ్’

image

భద్రాచలంలో శ్రీరామనవమి, శ్రీరామ మహాపట్టాభిషేకాలను పురస్కరించుకొని భక్తుల కోసం క్యూఆర్ కోడ్‌ను భద్రాద్రి జిల్లా పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మంటపం, లడ్డూ, తలంబ్రాల కౌంటర్ల వద్దకు భక్తులు సులభంగా కనుగొని అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో QR కోడ్‌ రూపొందించారు. సుదూర ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ క్యూఆర్ కోడ్‌ ఉపయోగపడనుంది.

Similar News

News November 25, 2025

తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్

image

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఫైల్స్ వేగంగా ముందుకు కదులుతున్నాయి. సంబంధిత అలైన్‌మెంట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి SCR పంపింది. ముందుగా గూడూరు స్టాఫింగ్ అనుకునప్పటికీ తిరుపతిలో స్టాఫింగ్ ఉండేలా ప్లాన్ చేయాలని TN ప్రభుత్వం కోరింది. త్వరలోనే ఈ DPR పూర్తి కానుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం 12గంటలుండగా బుల్లెట్ ట్రైన్‌లో కేవలం 2.20 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గంలో 11.6KM సొరంగం ఉంటుంది.

News November 25, 2025

ప్రారంభమైన ఆట.. బౌలర్లే దిక్కు

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే ఉంది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో SA 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ జట్టు 314 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. SAను త్వరగా ఆలౌట్ చేయకుంటే ఇండియా ముందు కొండంత లక్ష్యం పేరుకుపోవడం ఖాయం. బౌలర్లు ఏం చేస్తారో చూడాలి మరి.

News November 25, 2025

ADB: అన్నా మీరు సపోర్ట్ చేస్తే తప్పక గెలుస్తాం..!

image

స్థానిక ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో ఆశావహులు తమకే మద్దతు తెలపాలని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉమ్మడి ADBలోని 10 నియోజకవర్గాల్లో కేవలం నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతర నియోజకవర్గాల్లో వేరే పార్టీల MLAలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతల ఆధిపత్యం కొనసాగడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వరుస కడుతున్నారు.