News February 6, 2025
రామయ్య హుండీ ఆదాయం రూ.1,13,23,178
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738850490909_1280-normal-WIFI.webp)
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని 37 రోజుల తర్వాత గురువారం లెక్కించగా రూ.1,13,23,178 లు వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు. అంతేకాకుండా 109 గ్రాముల బంగారం, 895 గ్రాముల వెండి, 298 యూఎస్ డాలర్లు, 155 సింగపూర్ డాలర్లు, 430 యూఏఈ దీరమ్స్, 20 కెనడా డాలర్లు, 85 ఆస్ట్రేలియా డాలర్లు, 45 యూరప్ యూరోస్ కూడా భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 7, 2025
కమర్షియల్ షాపులకు ఆన్లైన్ ద్వారా టెండర్ల ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738826146537_52310961-normal-WIFI.webp)
ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్‌లకు ఆన్లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC DY.RM(O) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 24 వరకు అధికారిక వెబ్ సైట్ Tgsrtc.telanagana.gov.in (Tenders)లో టెండర్‌కు దరఖాస్తు చేసుకువాలన్నారు.
News February 7, 2025
KMM: సీఎం కప్ ఫుట్‌బాల్ విజేతలకు కలెక్టర్ అభినందన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738838028539_52220490-normal-WIFI.webp)
సీఎం కప్ ఫుట్‌బాల్ పోటీల్లో విజయం సాధించిన వివిపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం కలెక్టరేట్లో అభినందించారు. అండర్-13, 15, 17 గ్రూపుల్లో రన్నర్స్‌గా నిలవడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. టీమ్ కోచ్ మాధురికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్ ఆదర్శ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
News February 6, 2025
KMM: 1,04,995 మందికి రైతు భరోసా నిధులు జమ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738834255488_20471762-normal-WIFI.webp)
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 1,04,995 మంది రైతుల ఖాతాలలో రూ.58,22,56,809 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.