News February 2, 2025
రామసముద్రం: సీఐ, ఎస్ఐలకు 14 రోజుల రిమాండ్

రామసముద్రం ఎస్ఐ వెంకటసుబ్బయ్య రూ.70 వేలు లంచం తీసుకుంటూ గురువారం రాత్రి తిరుపతి ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఏసీబీ అధికారుల విచారణలో ఎస్ఐ వెంకట సుబ్బయ్య,రూరల్ సీఐ రమేశ్ ఇరువురు కుమ్మక్కై లంచం తీసుకున్నట్లు ఆధారాలు ఉండటంతో వారిని విచారించి అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఇవాళ హాజరుపరిచారు. న్యాయమూర్తి ఎస్సై, సీఐలకు 14 రోజులు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.
Similar News
News October 16, 2025
ఇకపై చికెన్ షాపులకు లైసెన్సులు!

AP: చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు షాపులకు కొత్తగా లైన్సెనింగ్ విధానం తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. కోడి ఏ ఫామ్ నుంచి వచ్చింది? దుకాణదారుడు ఎవరికి అమ్మారు? అనే అంశాలను ట్రాక్ చేసే వ్యవస్థను తీసుకురానుంది. గుర్తింపు పొందిన షాపుల నుంచే హోటళ్లు చికెన్ కొనేలా ప్రోత్సహించడం, స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి పెట్టనుంది.
News October 16, 2025
MNCL: భర్త వేధింపులు భరించలేకనే..!

నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమ ప్రస్థానంలో కొనసాగిన 60 మంది మావోయిస్టులు బుధవారం గడ్చిరోలిలో మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. వారిలో మంచిర్యాల(D) బెల్లంపల్లికి చెందిన సలాకుల సరోజ ఉన్నారు. ఆమె పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పని చేశారు. తల్లిదండ్రులు సరోజకు 15 ఏళ్ల ప్రాయంలో వివాహం చేశారు. భర్త వేధింపులు భరించలేక ఉద్యమానికి ఆకర్షితురాలై పోరుమార్గాన్ని ఎంచుకున్నారు.
News October 16, 2025
జనగామ: 18న విద్యాసంస్థల బంద్: జేఏసీ

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఈనెల 18న జనగామ జిల్లాలోని విద్యాసంస్థలను బంద్ చేయనున్నట్లు బీసీ జేఏసీ ప్రతినిధులు తీర్మానించారు. కావున ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వరంగ పరిధిలోని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని కోరారు.