News February 2, 2025
రామసముద్రం: సీఐ, ఎస్ఐలకు 14 రోజుల రిమాండ్

రామసముద్రం ఎస్ఐ వెంకటసుబ్బయ్య రూ.70 వేలు లంచం తీసుకుంటూ గురువారం రాత్రి తిరుపతి ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఏసీబీ అధికారుల విచారణలో ఎస్ఐ వెంకట సుబ్బయ్య,రూరల్ సీఐ రమేశ్ ఇరువురు కుమ్మక్కై లంచం తీసుకున్నట్లు ఆధారాలు ఉండటంతో వారిని విచారించి అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఇవాళ హాజరుపరిచారు. న్యాయమూర్తి ఎస్సై, సీఐలకు 14 రోజులు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.
Similar News
News April 10, 2026
కాకినాడ: 13న జాబ్ మేళా..రూ.10-30 వేల వరకు వేతనం

కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఈనెల 13వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ లచ్చారవు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాకు 6 కంపెనీలు హాజరవుతాయని, టెన్త-పీజీ చదివిన వారు అర్హులన్నారు. 18-30 ఏళ్లున్న వారు అర్హులని, ఎంపికైన వారికి రూ10వేల- 30వేల వరకు వేతనాలు ఇస్తానని తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు వికాస కార్యాలయంలో మేళాలో పాల్గొనాలన్నారు.
News April 10, 2026
KPHB: పోక్సో కేసులో వైద్యుడికి 7ఏళ్ల జైలు

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన డాక్టర్ కందుల సుబ్బారావు(76)కు కూకట్‌పల్లి పోక్సో కోర్టు 7ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో నమోదైన ఈ కేసులో నిందితుడికి శిక్షతో పాటు రూ.30,000 జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి ఎం.వెంకటేశ్వరరావు తీర్పు వెలువరించారు. కట్టుదిట్టమైన ఆధారాలతో కేసును నిరూపించిన కేపీహెచ్‌బీ పోలీసులను అధికారులు ప్రశంసించారు.
News April 10, 2026
రాయలసీమ అభివృద్ధికి జగన్ ఆటంకం: ఎంపీ

రాయలసీమకు అసలైన ద్రోహి జగన్ రెడ్డేనని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వంలో 102 ప్రాజెక్టులను రద్దు చేసి, నేడు రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సీమ ప్రాజెక్టుల కోసం రూ.10,014 కోట్లు కేటాయించి, చరిత్ర సృష్టించిందన్నారు. 80శాతం ప్రాజెక్టులు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే నిర్మించినవని గుర్తుచేశారు.


