News February 22, 2025
రామాయంపేటలో చిరుత సంచారం.. ఆందోళనలో రైతులు

రామాయంపేట శివారులోని జాతీయ రహదారి సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న 1421 సర్వే నంబర్లోని వ్యవసాయ పొలం వద్ద గత రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఉదయం లేగదూడను చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.
Similar News
News December 4, 2025
MDK: స్థానిక ఎన్నికలపై దృష్టి సారించిన మాజీ ఎమ్మెల్యే

రామాయంపేట మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలను పూర్తిగా కైవసం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మండలంపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని గ్రామాలలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునే విధంగా పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే గెలుపొందే అభ్యర్థులను మద్దతు తెలుపుతూ ఇతరులు వైదొలగే విధంగా బుజ్జగిస్తున్నారు.
News December 4, 2025
వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
News December 4, 2025
మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.


