News February 28, 2025
రామాయంపేట: చిరుతపులి కోసం సీసీ కెమెరాలు (PHOTO)

రామాయంపేట మండల కేంద్రంలో గత రాత్రి వ్యవసాయ పొలం వద్ద కుక్కపై చిరుత పులి దాడి చేయడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి చిరుత దాడి చేసిన పశువులపాక వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలో ఏమైనా ఆనవాళ్లు లభిస్తే చిరుత పులిని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని రైతులకు సూచించారు.SHARE IT
Similar News
News February 24, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

మెదక్ జిల్లాలోని 28 కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఉ. 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని, 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
News February 24, 2026
మెదక్: ‘పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి’

ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని సీఎస్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా విద్యా, పోలీస్, ఆర్టీసీ, వైద్య శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
News February 24, 2026
మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

పదో తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరుగుతాయని డీఈఓ విజయ తెలిపారు. మే 5 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రెండు విడతల్లో ఉంటాయి. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ వీటికి అర్హులని వెల్లడించారు. సందేహాల కోసం ఎస్. వెంకటస్వామిని సంప్రదించాలని సూచించారు.


