News February 28, 2025

రామాయంపేట: చిరుతపులి కోసం సీసీ కెమెరాలు (PHOTO)

image

రామాయంపేట మండల కేంద్రంలో గత రాత్రి వ్యవసాయ పొలం వద్ద కుక్కపై చిరుత పులి దాడి చేయడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి చిరుత దాడి చేసిన పశువులపాక వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలో ఏమైనా ఆనవాళ్లు లభిస్తే చిరుత పులిని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని రైతులకు సూచించారు.SHARE IT

Similar News

News March 21, 2025

బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు దూరంగా ఉండండి: ఎస్పీ

image

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్‌లకు అలవాటు పడొద్దని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి, డబ్బులు కోల్పోయి అప్పులపాలై, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్స్‌లలో బెట్టింగ్‌లకు పాల్పడిన, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన అట్టి వ్యక్తులపై చట్టారీత్యా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News March 21, 2025

మెదక్: అంతరిస్తున్న అడవులు..!

image

జీవకోటికి ప్రాణవాయువు అందించేది అడవులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా అడవి తగ్గడంతో పర్యావరణానికి ముంపు ముంచుకొస్తోంది. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల ప్రకారం 6.,89,342 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వాటిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు భూములు ఉన్నాయి. ఇందులో 6,865 ఎకరాల భూమి అక్రమనకు గురికావడంతో జీవరాసులకు మనుగడ లేకుండా పోతుందని అటవీ సిబ్బంది అధికారులు చెబుతున్నారు.

News March 21, 2025

మెదక్: 10338 మందికి  68 సెంటర్లు

image

నేటి నుంచి మెదక్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 సెంటర్లలో 10338 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 17 సెట్టింగ్స్ స్క్వాడ్స్, 68 చీఫ్ సూపర్డెంట్లు, 70 డిపార్ట్మెంటల్ అధికారులు, 590 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.

error: Content is protected !!