News March 13, 2025

రామాయణం రాసిన తొలి కవియిత్రి అతుకూరి మోలమాంబ: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కవియిత్రి అతుకూరి మోలమాంబ జయంతి అనంతపురం జిల్లాలో ఘనంగా జరిగింది. అనంతపురం నగరంలోని రెవెన్యూ భవన్‌లో కవియిత్రి అతుకూరి మోలమాంబ చిత్రపటానికి కలెక్టర్ వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామాయణం రాసిన తొలి కవియిత్రి అతుకూరి మోలమాంబ అని జిల్లా కలెక్టర్ తెలిపారు. నాట్య పోటీల్లో గెలిచిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతి ప్రదానం చేశారు.

Similar News

News December 26, 2025

అనంతపురం: మహిళలకు అండగా ‘సఖి’ వాహనం

image

సమాజంలో హింసకు గురయ్యే మహిళలు సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ఆశ్రయించవచ్చని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సఖి వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, బాధితులకు అవసరమైన రక్షణ, సాయం ఇక్కడ అందుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 25, 2025

శిల్పారామంలో జనవరి 1న సాంస్కృతిక కార్యక్రమాలు

image

అనంతపురం శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా 2026 జనవరి 1న సాయంత్రం 5గంటల నుంచి 8 వరకు ప్రముఖ కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. అనంత ప్రజల కోసం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

News December 25, 2025

తాడిపత్రి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చల్లవారిపల్లె సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.