News February 15, 2025
రామారెడ్డి: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డి మండలంలో శనివారం జరిగింది. ఏఎస్ఐ రవీందర్ వివరాలిలా.. ఇస్సన్నపల్లికి చెందిన నర్సింహులు(44) మూడు సంవత్సరాల క్రితం గ్రామంలో కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ASI పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలకు అలర్ట్

రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఈ నెల 11 నుంచి 19 వరకు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిడ్కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అటు పొగమంచు ప్రభావం ఉంటుందని, వాహనదారులు నిదానంగా వెళ్లాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News November 10, 2025
పాలమూరు: రైల్వే బోర్డుపై 5 భాషలు.. అరుదైన గౌరవం

భారతీయ రైల్వే నెట్వర్క్లో కేవలం మూడు స్టేషన్లలో మాత్రమే స్టేషన్ బోర్డులు ఐదు భాషల్లో ప్రదర్శించే అరుదైన గౌరవం ఉంది. అందులో రెండు మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సరిహద్దులు కలిగి ఉండటం విశేషం. రాయచూర్ జంక్షన్ (గద్వాల్), కృష్ణా జంక్షన్ (నారాయణపేట), హజూర్ సాహెబ్ నాందేడ్ (తెలంగాణ). నాందేడ్ స్టేషన్ గురుద్వారాను కలిగి ఉన్నందున అక్కడ ఐదో భాషగా పంజాబీ (గురుముఖి లిపిలో) ఉంటుంది.
News November 10, 2025
ఓ ప్రమాదం.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం

వరి కోతలకు వెళుతూ కరెంట్ షాక్కు గురై ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆదివారం గండేపల్లి(M) రామాయమ్మపాలెం వద్ద 11 కేవీ తీగలు తగిలి యంత్రం డ్రైవర్ గెడ్డం సందీప్ (రాపాక), యజమాని కరిపెట్టి సింహాద్రి అప్పన్న (ఇరగవరం) ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైన అప్పన్న పెద్ద కుమారుడు, సందీప్ అక్కలు ఈ వార్త విని గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.


