News November 9, 2024
రామారెడ్డి: బావిలో పడి వ్యక్తి మృతి

కాలు జారి బావిలో పడిన వ్యక్తి మృతి చెందిన ఘటన రామారెడ్డి మండలంలో జరిగింది. ఏఎస్ఐ లచ్చిరాం వివరాలిలా .. మండలంలోని రెడ్డి పేట గ్రామ వాసి బొల్లారం ఎల్లయ్య శుక్రవారం బావి వద్దకు స్నానానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడి గల్లంతయ్యాడు. శనివారం శవమై నీటిపై తేలాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
Similar News
News December 13, 2025
NZB: మరదలిపై అత్యాచారం చేసిన బావకు పదేళ్ల జైలు శిక్ష

మరదలిపై అత్యాచారం చేసిన బావకు నిజామాబాద్ జిల్లా మహిళా కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ 10 సంవత్సరాల జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 2019లో సాయినాథ్ అనే వ్యక్తి భార్య ఇంటి వద్ద లేని సమయంలో NZBలో ఉండే మరదలి వద్దకు వెళ్లి మీ అక్క రమ్మంటోందని చెప్పి బైక్ పై తీసుకెళ్లి ఇంట్లో అత్యాచారం చేశాడు. సాక్షాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి జైలు శిక్ష ఖరారు చేశారు.
News December 13, 2025
NZB: మద్యం దుకాణాలు బంద్

2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మద్యం దుకాణాలను మూసి వేయనున్నామని NZB జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. 14వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు నిజామాబాద్ రూరల్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల పరిధిలో మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నట్లు తెలిపారు.
News December 13, 2025
NZB: రెండవ విడత GP ఎన్నికల పోలింగ్ వివరాలు

పోలింగ్ సమయం: ఉదయం7గంటల నుంచి 1 గంట వరకు
*మొత్తం సర్పంచ్ స్థానాలు: 196
*ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ స్థానాలు: 38
*ఎన్నికలు జరుగనున్న సర్పంచ్ స్థానాలు:158
*పోటీలో ఉన్న అభ్యర్ధులు: 568
*మొత్తం వార్డు స్థానాలు: 1760
*ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డులు: 674
*ఎన్నికలు జరుగనున్న వార్డులు:1081
*పోటీలో ఉన్న అభ్యర్ధులు : 2634
*ఓటర్ల సంఖ్య: 2,38,838
*పోలింగ్ కేంద్రాలు : 1476


