News March 6, 2025
రామారెడ్డి: బైక్ పైనుంచి పడి మహిళ మృతి

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదం రామారెడ్డి PS పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్ఐ నరేష్ వివరాలు.. రామారెడ్డి గ్రామానికి చెందిన ఒగ్గు సాగర్ బైక్ పై తన తల్లి మానసతో వస్తుండగా, అదే సమయంలో వాకింగ్ చేస్తున్న వారిని ఢీకొట్టాడు. దీంతో ఆమె బైక్ పై నుంచి జారి పడింది. తీవ్ర గాయం కాగా అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 18, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.05 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 18, 2025
HYD: నిజాంపేటలో చిట్టీల పేరుతో రూ.150 కోట్లు స్వాహా

చిట్టీల పేరుతో డబ్బులు స్వాహా చేసిన ఘటన HYD నిజాంపేట పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. నిజాంపేటలో రేష్మ, అలీ అనే దంపతులు క్లినిక్ నడుపుతున్నారు. దీంతో పాటు చిట్టీలు నిర్వహించేవారు. అయితే సుమారు 100 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసిన రేష్మ దంపతులు పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు PSను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.