News January 19, 2025

రామారెడ్డి: వ్యక్తి దారుణ హత్య

image

రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో ఆదివారం వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమయి ఉండవచ్చని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Similar News

News February 13, 2025

ADB: ‘గదిలో బంధించి రేప్ చేసి.. వీడియోలు తీశాడు’

image

శాంతినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఆసిఫ్‌పై 1 TOWN PSలో అట్రాసిటీ, రేప్ కేసు నమోదైంది. CI సునీల్ వివరాల ప్రకారం.. ఆసిఫ్ ప్రేమపేరుతో వెంబడిస్తూ ఓ యువతిని బెదిరించగా ఆమె నిరాకరించింది. ఆమెను బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లి గదిలో బంధించాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకొని వీడియోలు తీశాడు. పెళ్లి చేసుకోకుంటే వీడియోలు లీక్ చేస్తానని కులంపేరుతో దూషించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.

News February 13, 2025

బీర్ల ధరపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్ 

image

బీరుకు 30 నుంచి 40 రూపాయలు ధర పెంచారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నామమాత్రపు ధర పెంచితేనే గగ్గోలు పెట్టారని వాపోయారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతమని, నాణ్యతలేని బీర్లు తీసుకొస్తున్నారని అన్నారు. బెల్టు షాపులు బంద్ చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారని ఇప్పుడూ సమాధానం చెప్పాలన్నారు.

News February 13, 2025

చేర్యాల: అనారోగ్యంతో మహిళా కానిస్టేబుల్ మృతి

image

చేర్యాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పైసా స్వప్న కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. దీంతో స్వప్న స్వగ్రామమైన వీరన్నపేటలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆమె మృతి పట్ల సీఐ ఎల్ శ్రీను, ఎస్ఐ నీరేష్, పోలీస్ సిబ్బంది, పలువురు నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు.

error: Content is protected !!