News January 23, 2025
రామారెడ్డి: హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు KMR జిల్లా అదనపు SP చైతన్య రెడ్డి బుధవారం తెలిపారు. రామారెడ్డి మండలం అన్నారంలో పొక్కిలి రవి(41) ఈ నెల 19న హత్యకు గురయ్యాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామారెడ్డి SI నరేష్ ఐదుగురిని అరెస్టు చేసి విచారించగా.. చేసిన నేరాన్ని వారు అంగీకరించారన్నారు. వారి నుంచి రూ.15 వేలు, 5 ఫోన్లు, 2 బైక్లు, సుత్తె, కర్ర, గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
Similar News
News December 8, 2025
పోలింగ్ రోజున వరంగల్లో స్థానిక సెలవులు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించినట్లు వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కార్మికులందరికీ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
News December 8, 2025
విజయవాడ: బాలికతో అసభ్య ప్రవర్తన.. 5 ఏళ్లు జైలు

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు జడ్జి శ్రీమతి వేల్పుల భవాని తీర్పు చెప్పారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఈ శిక్ష పడింది. బాధిత బాలికకు రూ. లక్ష నష్టపరిహారం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది.
News December 8, 2025
రీల్ రిపోర్టర్ కావాలనుకుంటున్నారా?

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రీల్స్ చేసే వారికి/ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. Way2Newsలో రీల్ రిపోర్టర్గా చేరి స్థానికంగా పేరుతో పాటు నెలకు ₹15 వేల నుంచి ₹40 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఎంచుకున్న కేటగిరీలో స్పష్టంగా వివరిస్తూ రీల్ చేసి పంపితే తదునుగుణంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. వివరాలకు <


