News February 21, 2025

రామారెడ్డి: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రామారెడ్డి మండలంలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్ఐ నరేశ్ వివరాలిలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన గుజ్జుల నవీన్ అదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికకు మొబైల్‌పై ఉన్న ఇష్టాన్ని అవకాశంగా చేసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News January 7, 2026

తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ ఉదయం పెరిగిన బంగారం ధరలు కాసేపటి క్రితం తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.550 తగ్గి రూ.1,38,270కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.500 పతనమై రూ.1,26,750 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,77,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 7, 2026

9,10 తేదీల్లో విశాఖ‌లో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0

image

విశాఖ వైభ‌వాన్ని మ‌రింత చాటిచెప్పేలా పోర్ట్స్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 9, 10వ తేదీల్లో MGM పార్కులో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 నిర్వ‌హించ‌నున్న‌ట్లు JC మయూర్ అశోక్ బుధవారం తెలిపారు. ఫెస్టివల్‌లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఇత‌ర కార్యక్రమాలు ఉంటాయ‌న్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర టూరిజం మంత్రి సురేశ్ గోపి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

News January 7, 2026

రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ సమీక్ష

image

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో SP సునీల్ షొరాణ్, రవాణా, ఆర్అండ్‌బీ అధికారులతో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను ముమ్మరం చేయాలని, బ్లాక్ స్పాట్స్ గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.