News March 24, 2025
రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ వస్తారు: మంత్రి

ఏప్రిల్ 7న జరిగే శ్రీ రామనవమి మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని, ఈసారి అంచనాకు మించి భక్తులు కూడా ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉందని కావున ఎవరికీ అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నవమి ఏర్పాట్లపై ఎంపీ బలరాం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, పీవో రాహుల్ తో కలిసి సమీక్షా జరిపారు.
Similar News
News November 5, 2025
జీవ ఎరువులతోనే భూమాతకు రక్షణ: కలెక్టర్

రసాయన ఎరువుల బదులు జీవ ఎరువులను (బయో ఫెర్టిలైజర్స్) విరివిగా వాడేలా రైతుల్ని చైతన్య పరచాలని కలెక్టర్ లక్ష్మీశా అధికారులకు సూచించారు. బుధవారం జరిగిన జిల్లాస్థాయి భూమాత రక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికే కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 5, 2025
కోస్గి: సీఎం ఇలాకా.. క్రీడల మంత్రి జిల్లాలో ఇదీ పరిస్థితి..!

కోస్గి కేంద్రంలో జరుగుతున్న అండర్-17 హ్యాండ్బాల్ జట్ల ఎంపికకు వచ్చిన క్రీడాకారులు అసౌకర్యానికి గురయ్యారు. వారికి భోజనం చేసేందుకు సరైన స్థలం లేక డ్రైనేజీ పక్కన కూర్చుని తినాల్సి వచ్చింది. సీఎం ఇలాకా.. క్రీడల మంత్రి జిల్లాలోనే ఈ పరిస్థితి ఉండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలలోనైనా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
News November 5, 2025
FLASH: బీజాపూర్- HYD హైవేపై మరో యాక్సిడెంట్

మీర్జాగూడ ఘటన మరవకముందే తాజాగా బీజాపూర్-HYD జాతీయ రహదారిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం తాజ్ సర్కిల్ వద్ద బుధవారం హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు రోడ్డు ఇరుకుగా ఉండడంతో వేగంగా మర్రిచెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులకు గాయాలవగా మరొక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.


