News April 4, 2025

రాములోరి కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ

image

ఈనెల 6, 7 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మంటపం, సెక్టార్లు, లడ్డూ, తలంబ్రాల కౌంటర్ వద్దకు సులభంగా వెళ్లేందుకు QR కోడ్, ఆన్‌లైన్ లింక్ రూపొందించినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

నిడిగొండ త్రికూట ఆలయాన్ని సందర్శించిన హెరిటేజ్ బృందం

image

రఘునాథపల్లి మండలం నిడిగొండలోని త్రికూట ఆలయాన్ని ‘హైదరాబాద్ హెరిటేజ్ వాక్’ మిత్ర బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. స్థానిక శివాలయం, ఇతర చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను ఆలయ పూజారి కృష్ణమాచార్యులు వారికి వివరించారు. అంతకుముందు జనగామ మండలం పెంబర్తిలోని హస్త కళలను సందర్శించి, అక్కడ వర్క్‌షాపు నిర్వహించారు.

News October 26, 2025

సిరిసిల్ల: రేపటి ప్రజావాణి రద్దు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రేపు (అక్టోబర్‌ 27) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇన్‌ఛార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్ తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన లక్కీ డ్రా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News October 26, 2025

కృష్ణ: గుట్టు చప్పుడు కాకుండా మాయం

image

కృష్ణ మండలం గుడెబల్లూర్ తిమ్మప్ప స్వామికి దీపం వెలిగించే గుట్టలో కొన్ని రోజులుగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బ్లాస్టింగ్ చేసి అక్రమంగా రాయిని తరలిస్తున్నారు. సహజ సంపద ఇలా అక్రమంగా తరలిస్తుంటే అధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్టను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.