News June 19, 2024
రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించిన షర్మిల

రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శమని షర్మిల అన్నారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Similar News
News October 20, 2025
రోజుకు 213 మందికి జన్మనిస్తున్న హైదరాబాద్

హైదరాబాద్.. మహానగరం దాదాపు కోటి మంది జనాభా ఉన్న సిటీ.. ఇక్కడ రోజూ వందలాది మంది పురుడుపోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కువ జనభ ఉన్న నగరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన CRS (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) నివేదికలో తేలింది. 2023వ సంవత్సరంలో సిటీలో 76,740 మంది జన్మించారు. అంటే సగటున నెలకు 6,395 మంది.. రోజుకు 213 మంది ఈలోకాన్ని చూశారన్న మాట.
News October 20, 2025
కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం రావాలి: జాన్‌వెస్లీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గెర్రె గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్రంగా ఖండించారు. కాచిగూడలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని, కుల, మతాంతర వివాహితుల రక్షణచట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
News October 20, 2025
GREAT: ఎవరెస్ట్‌పై హైదరాబాదీ తల్లీకుమారుడు

ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌ను కాచిగూడకు చెందిన తల్లీకుమారుడు విజయవంతంగా అధిరోహించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ శరణ్య (39) తన కుమారుడు శేయాంశ్ (12)తో కలిసి 8 రోజుల్లోనే 5,364 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు చేరుకున్నారు. అక్టోబర్ 5న ప్రారంభించిన ప్రయాణం 13న విజయవంతంగా ముగిసింది.