News February 5, 2025
రాయగడ డివిజన్ పరిధిలోని రైల్వే లైన్లు ఇవే

రాయగడ<<15366937>> డివిజన్<<>> పరిధిలోని రైల్వే లైన్ల వివరాలను రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.➤ కొత్తవలస- బచేలి/ కిరండోల్➤ కూనేరు-తెరువలి జంక్షన్➤ సింగ్ పూర్ రోడ్-కొరాపుట్ జంక్షన్➤ పర్లాకిముండి-గుణపూర్ రైల్వేస్టేషన్‌ను రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చారు.
Similar News
News October 28, 2025
GNT: ‘మొంథా’ ప్రభావం..ZP సమావేశంపై అనిశ్చితి

గుంటూరు జిల్లాలో మొంథా తుపాన్ కారణంగా బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనిశ్చితిలో పడింది. వర్షాలు, గాలుల ప్రభావంతో ప్రజా ప్రతినిధుల రాకపోకలు కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున, తగినంత మంది జెడ్పీటీసీలు హాజరు కాకపోతే సమావేశం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News October 28, 2025
వంటింటి చిట్కాలు

* టమాటాలు మగ్గిపోకుండా ఉండాలంటే, వాటిని కాగితం సంచిలో ఉంచి దానిలో ఓ యాపిల్‌ను పెట్టండి.
* ఖాళీ అయిన పచ్చడి సీసాలో దాని తాలూకు ఘాటు వాసన పోవాలంటే సగం వరకు గోరువెచ్చని నీరు నింపి రెండు చెంచాల వంటసోడా కలిపి కాసేపు వదిలేయండి. తరువాత శుభ్రంగా కడిగి వాడుకోండి.
* కేక్ తయారు చేసేటప్పుడు గుడ్డు, మైదా మిశ్రమం కాస్త మెత్తగా ఉండేట్లు చూసుకోండి. లేదంటే కేకు గట్టిగా, పొడిబారినట్లు అవుతుంది.
News October 28, 2025
జూబ్లీ బైపోల్: ప్రచారానికి రేవంత్.. మరి KCR?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను టీపీసీసీ ఖరారు చేసింది. అక్టోబరు 31 నుంచి ప్రచారం చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా BRS అధినేత కేసీఆర్ ప్రచారంచేసే తేదీలు ఖరారు కాలేదు. తమ బాస్ ప్రచారం చేస్తే సునీత గెలుస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రచారంపై పార్టీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.


