News April 1, 2025

రాయచోటిలో అర్ధరాత్రి నడి రోడ్డుపై కొట్టుకున్న యువకులు

image

అన్నమయ్య జిల్లాలో ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి నడి రోడ్డుపై కొట్టుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి రాయచోటిలోని మదనపల్లె రోడ్డు శివాలయం సమీపంలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు గాయపడటంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 19, 2025

హిడ్మా అనుచరుడు సరోజ్ అరెస్టు!

image

AP: మావోయిస్టు అగ్రనేత హిడ్మా నిన్న ఉదయం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడం తెలిసిందే. అయితే ఆయన అనుచరుడు మద్వి సరోజ్‌ కోనసీమ(D) రావులపాలెంలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు గాలింపు చేపట్టి ఈరోజు అరెస్టు చేశారు. రహస్య ప్రాంతంలో ఆయన్ను విచారిస్తున్నారని సమాచారం. కాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సరోజ్ రావులపాలెం ఎందుకు వచ్చాడు? ఎప్పటినుంచి ఉంటున్నాడు? తదితరాలపై ఆరా తీస్తున్నారు.

News November 19, 2025

ఈ ఏడాది 328 రోడ్డు ప్రమాదాల్లో మరణాలు: సీపీ

image

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 18వ తేదీ వరకు వ్యక్తుల మరణాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు 328 జరిగాయని పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 92 ప్రమాదాలు తక్కువగా జరిగాయని ఆయన వివరించారు. నందిగామలోని అనాసాగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో కమిషనర్ ఈ వివరాలను వెల్లడించారు.

News November 19, 2025

చింతూరు: ఆడుతూ స్పృహ తప్పి చిన్నారి మృతి

image

చింతూరు మండలం కుయుగూరులో చిన్నారి శ్యామల జనని(5) బుధవారం ఆకస్మికంగా మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. బాలిక తోటి పిల్లలతో అంగన్వాడీ కేంద్రానికి వెళుతూ దారిలో ఉన్న రేగుపళ్లు తిని ఆడుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయిందని గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యుల చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్నారు.