News August 2, 2024

రాయచోటిలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

రాయచోటిలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో ఉరివేసుకొని నాసిర్ హుస్సేన్ అనే హిందీ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తలు విడివిడిగా ఉండడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతుడు వీరబల్లి మండలం, యర్రంరాజుగారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News September 13, 2024

పులివెందుల: సొంత తమ్ముడిని చంపిన అన్న.. కారణం ఇదే.!

image

మతిస్థిమితం లేక సొంత తమ్ముడిని <<14090347>>అన్న చంపిన ఘటన<<>> రాయలాపురంలో చోటుచేసుకుంది. పులివెందుల అర్బన్ సీఐ జీవన్ గంగానాథ్ బాబు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాయలాపురం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని బాబయ్య తమ్ముడు బాబా ఫక్రుద్దీన్‌తో గొడవపడి కోపంలో సమ్మెటతో తమ్ముడిని బలంగా కొట్టి చంపినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు.

News September 13, 2024

పులివెందుల: ‘నా కుమారుడి ఆరోగ్యం బాగుంది’

image

తన కుమారుడు వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగుందని వైఎస్ మధుసూధన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైఎస్ జగన్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు ఈ విషయంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభిషేక్ తీవ్ర జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడని ప్రస్తుతం బాగుందని వెల్లడించారు.

News September 13, 2024

నిండుకుండలా గండికోట జలాశయం

image

గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యంతో కళకళలాడుతోంది. జలాశయంలో 24.85 క్యూసెక్కుల నీరు నిల్వ ఉన్నట్లు జనవనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. శుక్రవారం 11 గంటలకు మైలవరం జలాశయానికి నీరు వదులుతున్నట్లు సమాచారం. అవుకు రిజర్వాయర్ నుంచి 10,000 క్యూసెక్కులు వరద నీరు జలాశయంలోకి వస్తున్నట్లు చెప్పారు. జలాశయం నుంచి 2,990 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.