News August 11, 2024

రాయచోటిలో పిచ్చికుక్కల దాడి.. 34 మందికి గాయాలు

image

జిల్లా కేంద్రమైన రాయచోటిలో శనివారం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. కొత్తపేట, గాలివీడు రోడ్డు, బస్టాండ్ రోడ్డు, మాసాపేట ప్రాంతాలకు చెందిన 34 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన అహమదుల్లాను కడప రిమ్స్‌కు తరలించగా, వెంకటరమణ, పిచ్చమ్మ, ఇర్ఫాన్, రంగయ్య నాయుడు, కుళ్లాయప్ప, మనోహర్, ఆనంద్, బాబ్జి, ఖదీర్ బాష, అమృత, నాగేశ్వరమ్మ పలువురు గాయపడ్డారు.

Similar News

News September 7, 2024

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఆర్జిత సేవలు రద్దు

image

ఒంటిమిట్ట కోదండ రామాలయం జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఆర్జిత సేవలను రెండు నెలల పాటు రద్దు చేసినట్లు తనిఖీ అధికారి నవీన్ కుమార్ శుక్రవారం తెలిపారు. గర్భాలయంలోకి భక్తులను నిలిపివేస్తామని తెలిపారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా నిర్వహించే కల్యాణం, అర్చన సేవలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని కోరారు.

News September 7, 2024

నేడు కడప జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి కడప జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కడప, అన్నమయ్య జిల్లాల్లోని పలు మండలాల్లో ఈ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

News September 7, 2024

కడప: 17 నుంచి 21 వరకు గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రద్దు

image

గుంటూరు-తిరుపతి-గుంటూరు మధ్య నడుస్తున్న గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. గిద్దలూరు, దిగువమెట్ట మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గుంటూరు, తిరుపతి మధ్య నడిచే రైలు 17 నుంచి 21 వరకు, తిరుపతి, గుంటూరు మధ్య నడిచే రైలు 18 నుంచి 21 వరకు రద్దు చేశారన్నారు.