News April 10, 2025
రాయచోటిలో రెండు రోజులు ట్రాఫిక్ మళ్లింపు

ఈ నెల11న కడప జిల్లా ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఈ నెల 11ఉదయం10 గంటల నుంచి 12 వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని చెప్పారు
Similar News
News December 9, 2025
జనగామ: ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష

తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై నేడు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎంపీడీవోలతో గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతి మండలంలో ఓటింగ్ కేంద్రాలు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ వంటి అంశాలను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.
News December 9, 2025
తిరుపతి SVU ఫలితాల విడుదల

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో ఈ ఏడాది M.L.I.Sc(మాస్టర్ లైబ్రరీ సైన్స్ ) 1, 2 సెమిస్టర్ పరీక్షలు, దూరవిద్య విభాగం(SVU DDE) ఆధ్వర్యంలో డిగ్రీ B.A/B.Com/B.Sc చివరి సంవత్సరం పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. www.manabadi.co.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News December 9, 2025
ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుంది: కలెక్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటివరకు 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37 వేల మంది రైతులు నుంచి కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోపుగా రూ.483.27 కోట్లు, 48 గంటల లోపుగా రూ.18.84 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా 90 వేల గన్నీ బ్యాగులను రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచామన్నారు.


