News August 30, 2024
రాయచోటి: ఆగస్టు 31న పింఛన్ల పంపిణీ

సెప్టెంబరు నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల 31వ తేదీన పంపిణీ చేయనున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 31వ తేదీన పెన్షన్లు అందకపోతే సెప్టెంబరు 2వ తేదీన పింఛన్లు అందజేస్తామన్నారు. 2 వ తేదీ తర్వాత పింఛన్లు అందవని, కావున పింఛనర్లు ఈ నెల 31న గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
Similar News
News August 31, 2025
రేపు పులివెందుల రానున్న YS జగన్

కడప జిల్లాలో మూడు రోజులపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించానున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ మధ్యాహ్నానికి పులివెందుల చేరుకోనున్న జగన్, రెండో తేదీ ఉదయం తన తండ్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలలో నివాళులర్పిస్తారు. అనంతరం లింగాల మండలం అంబకంపల్లి చేరుకొని జలహారతిలో పాల్గొంటారు. పులివెందుల చెరుకుని రాత్రికి బస చేసి మూడవ తేదీ ఉదయం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
News August 31, 2025
కడప: మూడు ప్రాంతాల్లోనే బార్ల ఏర్పాటు

కడప జిల్లాలో మూడు ప్రాంతాల్లోనే రేపటి నుంచి కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. కడపలో 8, ప్రొద్దుటూరులో 5, బద్వేల్లో 1 కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలోని మిగతా బార్లను నేటి అర్ధరాత్రి నుంచి క్లోజ్ కానున్నాయి. నూతన బార్ పాలసీ మేరకు జిల్లాలో జనరల్ కేటగిరిలో 27, గీత కులాల కేటగిరీలో 2, మొత్తం 29 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. 14 వాటికే దరఖాస్తులు రాగా వాటిని డ్రా ద్వారా అధికారులు కేటాయించారు.
News August 31, 2025
కడప: రేషన్ కార్డుదారులకు ఉచితంగా జొన్నలు

చౌకా దుకాణాల ద్వారా సెప్టెంబరు నుంచి లబ్ధిదారులకు ఉచితంగా జొన్నలు అందించనున్నట్లు జేసీ అతిథి సింగ్ శనివారం తెలిపారు. బియ్యం కార్డులో ముగ్గరు సభ్యులు కన్నా తక్కువ ఉంటే ఒక కిలో మాత్రమే ఇస్తామన్నారు. సభ్యులు ఎక్కువ ఉంటే రెండు కిలోలు జొన్నలు బియ్యానికి బదులుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంత్యోదయ, అన్నయోజన వారు కూడా అర్హులన్నారు.