News August 30, 2024
రాయచోటి: ఆగస్టు 31న పింఛన్ల పంపిణీ
సెప్టెంబరు నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల 31వ తేదీన పంపిణీ చేయనున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 31వ తేదీన పెన్షన్లు అందకపోతే సెప్టెంబరు 2వ తేదీన పింఛన్లు అందజేస్తామన్నారు. 2 వ తేదీ తర్వాత పింఛన్లు అందవని, కావున పింఛనర్లు ఈ నెల 31న గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
Similar News
News September 8, 2024
సిద్దవటం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
కడప జిల్లాలో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దవటం మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారి బొగ్గిడివారిపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ఆటో ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా.. నలుగురు గాయాలయ్యాయి. ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 8, 2024
ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.. కడప SP
వినాయక చవితి పండుగ నేపథ్యంలో వినాయక మండపాల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలను కోరారు. ప్రతి వినాయక మండపం వద్ద పోలీసు శాఖ తరపున బందోబస్తు ఏర్పాటు చేశామని, అయితే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రజలు వారి విలువైన ఆభరణాలు వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్లు, ఇతర వస్తువుల దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News September 7, 2024
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్
గత రెండు రోజులుగా ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహించినట్లు రేంజర్ కళావతి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. సిద్దవటం లంకమల అభయారణ్యంలోని గొల్లపల్లి బీటులో తాపల రస్తా, ఏటిమడుగు, నిమ్మకాయల బండతో పాటుగా.. సమస్యాత్మక ప్రదేశాలలో రెండు రోజులుగా ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహించామన్నారు. ఈ కూంబింగ్‌లో డిప్యూటీ రేంజర్ కే ఓబులేసు, గొల్లపల్లి FBO, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.