News March 10, 2025
రాయచోటి: కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రాయచోటి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు.
Similar News
News March 10, 2025
బాపులపాడులో అధిక ఉష్ణోగ్రతలు.. తగ్గని వేడి.!

కృష్ణా జిల్లా గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేడు బయట ఎండ తీవ్రత కనిపించకపోయినా, ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గలేదు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో 35 డిగ్రీలు, గన్నవరంలో 36 డిగ్రీలు నమోదయ్యాయి. పైగా గాలిలేని వాతావరణం ఉక్కపోతను మరింత పెంచింది. “గాలి లేక అసలే ఉమ్మటేసింది!” అని స్థానికులు అంటున్నారు.
News March 10, 2025
’50 శాతం స్థానాలు ఓబీసీలకు కేటాయించాలి’

దేశ జనాభాలో ఓబీసీల సంఖ్య 50 శాతానికి మించి ఉన్నందున, మొత్తం పార్లమెంటు స్థానాలలో 50 శాతం ఓబీసీలకు కేటాయించాలని బీసీ సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు భోగి రమణ డిమాండ్ చేశారు. డాబాగార్డెన్స్లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్లో ఛలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈనెల 12,13 తేదీలలో న్యూఢిల్లీలో ఓబీసీ మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఉందని తెలిపారు.
News March 10, 2025
కలెక్టర్ క్రాంతిని కలిసిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని ఎస్పీ కలిశారు. ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.