News May 20, 2024

రాయచోటి: కౌటింగ్ ప్రక్రియ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు

image

సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఎస్పీ కృష్ణారావుతో కలిసి ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని విధాల సన్నద్ధంగా ఉండాలన్నారు.

Similar News

News December 13, 2024

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య: YS జగన్‌

image

కడప జిల్లా వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల్లో అధికార టీడీపీ నేతల దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్ట్‌లపై దాడి హేయమైన చర్యని YS జగన్‌ అభిప్రాయపడ్డారు. X వేదికగా ఈ దాడిని ఆయన శుక్రవారం తీవ్రంగా ఖండించారు. మీడియాపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. నిజాలు నిర్భయంగా వెలికితీస్తున్న మీడియా గొంతు నొక్కేయాలనుకోవడం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్య అన్నారు.

News December 13, 2024

కీలక విషయాలు బయటపెట్టిన కడప కలెక్టర్

image

సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కడప కలెక్టర్ శ్రీధర్ కీలక విషయాలు బయటపెట్టారు. ‘వేరే జిల్లాలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్‌తో మా జిల్లాలో 3,600 మంది పింఛన్ తీసుకుంటున్నారు. వీరిపై అనుమానంతో తనిఖీలు చేయగా కేవలం 127 మందే అర్హులని తేలింది. మిగిలిన వాళ్లు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకున్నారు’ అని CMకు చెప్పారు. వెంటనే వారి నుంచి పెన్షన్ డబ్బులు రికవరీ చేసి.. అవసరమైతే కేసు పెట్టాలని CM ఆదేశించారు.

News December 13, 2024

రాజంపేట: ఆటో డ్రైవర్ సూసైడ్

image

రాజంపేట మండలం ఆకేపాడు నవోదయ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ రాజశేఖర్ (37) కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. మద్యానికి బానిసైనా రాజశేఖర్ ఇంట్లో తన భార్య డ్వాక్రా కోసం ఉంచుకున్న డబ్బులు, కొంత నగలు అమ్మి మద్యానికి ఖర్చు చేశాడు. దీంతో భార్యాభర్తల ఇరువురి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.