News April 14, 2025

రాయచోటి: పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

image

అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌లో నేడు జరగాల్సిన పీజీఆర్ఎస్ రద్దయింది. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి, ఫిర్యాదుల కోసం కార్యాలయానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 17, 2026

HYD: 3 రక్షణ కమిటీలు.. ఆక్రమణదారుల కోసమేనా? (3)

image

చెరువులను కాపాడతామని 2018లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసిన సర్కారు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. FTL మార్కింగ్, ఫెన్సింగ్ అంతా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్‌లో బడా బాబులు ఓ చెరువును మింగేస్తుంటే అధికారులు ‘పరిశీలిస్తాం’ అంటూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కట్టడాలు కూల్చే ధైర్యం అధికారులకు లేదా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? దీనిపై దర్యాప్తు జరగాల్సిందే!

News April 17, 2026

HYD: 3 రక్షణ కమిటీలు.. ఆక్రమణదారుల కోసమేనా? (3)

image

చెరువులను కాపాడతామని 2018లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసిన సర్కారు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. FTL మార్కింగ్, ఫెన్సింగ్ అంతా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్‌లో బడా బాబులు ఓ చెరువును మింగేస్తుంటే అధికారులు <<19672685>>’పరిశీలిస్తాం’<<>> అంటూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కట్టడాలు కూల్చే ధైర్యం అధికారులకు లేదా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? దీనిపై దర్యాప్తు జరగాల్సిందే!

News April 17, 2026

ఏపీ SECగా అనిల్ చంద్ర.. గవర్నర్ ఆమోదం

image

AP: స్టేట్ ఎలక్షన్ కమిషనర్(SEC)గా రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. కాసేపట్లో జీవో వెలువడనుంది. అనిల్ చంద్ర గతంలో రాష్ట్ర సీఎస్‌గా పనిచేశారు. రిటైరైన తర్వాత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెలాఖరుతో SECగా నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.