News February 12, 2025
రాయచోటి: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

భార్యను క్రూరంగా హత్యచేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ రాయచోటి 5వ అదనపు జిల్లా జడ్జి తీర్పిచ్చారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి ధనంజయ(31) తన భార్య లక్ష్మీదేవిని 2017 ఫిబ్రవరిలో హత్య చేశాడు. అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు చేశారు. కోర్టు పూర్వాపరాలను విచారించింది. నేరం రుజువు కావడంతో ధనంజయకు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం జడ్జి కృష్ణన్ కుట్టి తీర్పునిచ్చారు.
Similar News
News March 21, 2025
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ వెబ్ సిరీస్

క్రైమ్ థ్రిల్లర్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా జీత్, ప్రోసెన్‌జీత్ ఛటర్జీ, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగద కీలక పాత్రల్లో నటించారు. 2022లో వచ్చిన ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్టవడంతో నెట్‌ఫ్లిక్స్ పార్ట్-2 తెరకెక్కించింది.
News March 21, 2025
విశాఖ అధికారులతో జూమ్ కాన్ఫిరెన్స్

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.సి.డి.సి.డి.సర్వే, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, మాతా, శిశు మరణాల రేటు తగ్గింపు, గర్భిణీల టీ.టీ-1, టీ-టీ-2 డోసులు, జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. DMHO జగదేశ్వరరావు ఉన్నారు.
News March 21, 2025
మచిలీపట్నం: చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య

మచిలీపట్నం చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. మృతుడు అదే ప్రాంతానికి చెందిన విర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీనుగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీను నివాసంలోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన ఘటన స్థలిలోనే మృతిచెందారు. పోలీసులు హత్యాస్థలానికి చేరుకొని మచిలీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.