News August 7, 2024
రాయచోటి: రాజగోపాల్‌కు నాటు తుపాకీ ఎక్కడిది?

సంబేపల్లె మండలంలో ఇటుకల బట్టీ నిర్వాహకుడు <<13787732>>రాజగోపాల్ ఆత్మహత్య<<>>కు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే రూ.15 లక్షలు అప్పు, ఆరోగ్య సమస్యలు ఉండటంతో మనస్తాపం చెంది మంగళవారం నాటు తుపాకీతో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. తుపాకీ వినియోగంపై క్లూస్‌టీం పరిశీలిస్తోంది. రాజగోపాల్‌కు నాటు తుపాకీ ఎక్కడిది, ఎంత కాలంగా అతని వద్ద ఉందనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తులసీరాం తెలిపారు.
Similar News
News November 13, 2025
19న అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు

కడప వైవీయూ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. బద్వేలు బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని వైవీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి తెలిపారు. క్రీడాకారులు వైవీయూ అనుబంధ కళాశాలల్లో చదివి, 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు అర్హులన్నారు.
News November 13, 2025
కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం.. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న చిన్న సుంకిరెడ్డికి ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల(M) భీమునిపాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.
News November 13, 2025
కడప జిల్లాలో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై విచారణ!

జిల్లాలో 14 అర్బన్ మండలాల్లో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం నాటికి 9,612 ఇళ్ల నిర్మాణాలను ప్రత్యేక యాప్ ద్వారా పరిశీలించారు. వాటి నిర్మాణాల వివరాలు ఫొటోలతో నమోదు చేశారు. YCP ప్రభుత్వంలో ఈ ఇళ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.


