News August 7, 2024

రాయచోటి: రాజగోపాల్‌కు నాటు తుపాకీ ఎక్కడిది?

image

సంబేపల్లె మండలంలో ఇటుకల బట్టీ నిర్వాహకుడు <<13787732>>రాజగోపాల్ ఆత్మహత్య<<>>కు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే రూ.15 లక్షలు అప్పు, ఆరోగ్య సమస్యలు ఉండటంతో మనస్తాపం చెంది మంగళవారం నాటు తుపాకీతో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. తుపాకీ వినియోగంపై క్లూస్‌టీం పరిశీలిస్తోంది. రాజగోపాల్‌కు నాటు తుపాకీ ఎక్కడిది, ఎంత కాలంగా అతని వద్ద ఉందనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తులసీరాం తెలిపారు.

Similar News

News February 7, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.16,040
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,757
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.

News February 7, 2026

పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి..!

image

కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల ఎన్ఆర్ఈజీఎస్ పనులను ఈ ఆర్థిక సవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టి పురోగతిలో ఉన్న వాటిని మార్చి 15 లోపు పూర్తి చేయాలన్నారు.

News February 7, 2026

నేడు టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

image

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నూతన కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన అధ్యక్షుడిగా భూపేష్ సుబ్బరామిరెడ్డిని అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఆధ్వర్యంలో అధ్యక్షుడితో సహా కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.