News May 10, 2024
రాయచోటి: ‘రాబోయే ౩ రోజులు చాలా కీలకం’

‘రాబోయే మూడు రోజులు చాలా కీలకం. పక్కా ప్రణాళిక, పటిష్ఠమైన సూక్ష్మ కార్యాచరణతో ఎన్నికలను విజయవంతం చేయాలి. పండుగ వాతావరణంలో పోలింగ్ నిర్వహణ ఉండాలి’ అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి యం. అభిషిక్త్ కిషోర్ ఎన్నికలలో పాల్గొంటున్న అధికారులు సిబ్బందికి ఉద్బోధించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్ నుంచి పలువురు అధికారులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు.
Similar News
News December 1, 2025
కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్ష.. మళ్లీ ఎప్పుడంటే.!

దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.
News December 1, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు..
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,790
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.11,767
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1750
News December 1, 2025
ప్రొద్దుటూరు: చిన్నోడే పెద్ద పోరాటం!

ప్రొద్దుటూరుకు చెందిన 6వ తరగతి విద్యార్థి ఎబినేజర్ ధైర్యసాహసాలు మెచ్చుకోవాల్సిందే. కాలువకు రక్షణ గోడలేక తన స్నేహితుడు కిందపడ్డాడని బాలుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇలా మరొకరు ఇబ్బంది చెందకూడదని పోరాటానికి దిగాడు. కాలువకు వెంటనే రక్షణ గోడ నిర్మించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డికి విన్నవించాడు. త్వరగా రక్షణగోడ నిర్మించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆ కుర్రాడు హెచ్చరించాడు.


