News November 12, 2024

రాయచోటి: ‘రాష్ట్రంలో సంపద సృష్టి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు’

image

2024-2025వ సంవత్సరం సంపద సృష్టి లక్ష్యంగా అభివృద్ధి చక్రాన్ని పున: ప్రారంభించే ఉద్దేశ్యంతో రూ.2,94,427.25 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటిలో రాష్ట్ర బడ్జెట్‌పై కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్, టీడీపీ నాయకులు శివప్రసాద్ నాయుడు, బీజేపీ నాయకులు వెంకటరమణ గౌడ్ పాల్గొన్నారు.

Similar News

News October 18, 2025

కడప: దీపావళి పండగకు 33 ప్రత్యేక బస్సులు

image

దీపావళి పండగ సందర్భంగా కడప జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 33 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. బెంగళూరు – చెన్నై, హైదరాబాదు – విజయవాడకు నడుస్తాయన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News October 18, 2025

ఒంటిమిట్టకు తిరుమల లడ్డూలు

image

ఒంటిమిట్ట రామాలయానికి వచ్చే భక్తులకు 600 తిరుమల లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారి నవీన్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కోటి రూ.50గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పొందవచ్చన్నారు.

News October 18, 2025

అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేయరాదు: ఎస్పీ

image

పోలీసుల అనుమతి లేకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఇళ్లల్లో బాణాసంచా నిలువలు కానీ బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయరాదని ఎస్పీ నచికేత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే టపాసుల విక్రయాలు చేయాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.