News November 12, 2024
రాయచోటి: ‘రాష్ట్రంలో సంపద సృష్టి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు’

2024-2025వ సంవత్సరం సంపద సృష్టి లక్ష్యంగా అభివృద్ధి చక్రాన్ని పున: ప్రారంభించే ఉద్దేశ్యంతో రూ.2,94,427.25 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటిలో రాష్ట్ర బడ్జెట్‌పై కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్, టీడీపీ నాయకులు శివప్రసాద్ నాయుడు, బీజేపీ నాయకులు వెంకటరమణ గౌడ్ పాల్గొన్నారు.
Similar News
News April 14, 2026
కడప జిల్లాలో బెల్ట్ షాపులపై 47 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసులు నమోదు చేశారు. 47 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.
News April 14, 2026
కడప: స్పోర్ట్స్ కోటా టీచర్లకు తిరుపతిలో రేపు సమావేశం

మెగా డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోట ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 15న తిరుపతిలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ మంగళవారం తెలిపారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు డీఎస్డీవో/డీఎస్ఏ కార్యాలయం, తిరుపతిలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి ప్రత్యేక సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
News April 13, 2026
నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించాలి: SP

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”లో జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 152 ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.


