News December 20, 2024

రాయచోటి వద్ద RTC బస్‌లో మహిళ ప్రసవం

image

ఆర్టీసీ బస్‌లోనే మహిళ ప్రసవించిన ఘటన శుక్రవారం జరిగింది. పీసీపల్లి మండలం ఇర్లపాడుకు చెందిన ప్రయాణికురాలు ‘బెంగళూరు’ నుంచి కనిగిరి బస్‌లో బయల్దేరారు. రాయచోటి సమీపంలోని రామాపురం వద్ద పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో డ్రైవర్ బస్ ఆపారు. వెంటనే ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డను 108లో ఆసుపత్రికి తరలించినట్లు డ్రైవర్లు బాబు, రసూల్ తెలిపారు.

Similar News

News December 19, 2025

కడప జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులకు గమనిక

image

కడప జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులు(సివిల్) శిక్షణకు హాజరు కావాలని SP విశ్వనాథ్ ఆదేశించారు. ‘పురుషులకు తిరుపతి కళ్యాణి డ్యాం, మహిళలకు ఒంగోలు PTCలో ఈనెల 21 నుంచి ట్రైనింగ్ ఉంటుంది. ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, SBI పాస్‌బుక్ జిరాక్స్, రూ.10వేల కాషన్ డిపాజిట్, పోలీస్ డిపార్ట్‌మెంట్ సర్వీస్ బుక్, 6స్టాంప్ సైజ్ ఫోటోలు, రూ.100 అగ్రిమెంట్ బాండ్‌తో ఎస్పీ ఆఫీసుకు 21వ తేదీ రావాలి’ అని SP చెప్పారు.

News December 19, 2025

మాట నిలబెట్టుకున్న కమలాపురం MLA

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో మన కడప జిల్లా అమ్మాయి శ్రీచరణి సత్తాచాటిన విషయం తెలిసిందే. ఆమెకు రూ.5లక్షలు ఇస్తానని అభినందన సభలో కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షల చెక్కును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో కలిసి గురువారం తన కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రపంచ కప్ గెలిచి కమలాపురం నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు.

News December 19, 2025

23న కడపలో రాయలసీమ AMCల ఛైర్మన్ల సమావేశం

image

ఈనెల 23న కడపలో రాయలసీమ జిల్లాల వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ల సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా AMC ఛైర్మన్లను నియమించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాయలసీమ పరిధిలోని 72 వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కడప రీజనల్ డైరెక్టర్ రామాంజనేయులు గురువారం తెలిపారు.