News August 9, 2024

రాయదుర్గం మీదుగా నడిచే మూడు రైళ్లు రద్దు

image

రాయదుర్గంలోని రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్ వ్యవస్థను మార్చేందుకు నేడు రాయదుర్గం మీదుగా ప్రయాణించే 3 రైళ్లను రద్దు చేసినట్లు నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్ ముఖ్య సమాచార అధికారి డాక్టర్ మంజునాథ్ తెలిపారు. చిక్కజాజూరు-గుంతకల్లు, హొస్పేట -బెంగళూరు మధ్య ప్రయాణించే 3 రైళ్లు రాయదుర్గం మీదుగా కాకుండా హొస్పేట, అమరావతి కాలనీ, దావణగెరె, చిక్కజాజురు మార్గంలో వెళ్తాయన్నారు.

Similar News

News September 30, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి అమ్మాయి

image

తాడిపత్రి పట్టణంలోని కస్తూర్బాలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని కొప్పల నందిని రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ మునెమ్మ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలలో అండర్- 19 విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు విద్యార్థినిని పీఈటీ చంద్రకళ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

News September 30, 2024

వరద బాధితులకు తాడిపత్రికి చెందిన సంస్థ రూ.కోటి విరాళం

image

తాడిపత్రిలోని అర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ మూర్తి సీఎం చంద్రబాబునాయుడును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. అనంతపురం జిల్లాలో చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు ఉద్యోగ కల్పన నైపుణ్య అభివృద్ధి గురించి సీఎంకు వివరించారు.

News September 30, 2024

సీడ్ యాప్ రాష్ట్ర ఛైర్మన్‌గా రాయదుర్గం వాసి

image

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను అందించేలా సీడ్ యాప్ ద్వారా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ నూతన ఛైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. రాయదుర్గం పట్టణానికి చెందిన ఆయన విజయవాడలోని డాక్టర్ నందమూరి తారక రామారావు పరిపాలనా భవనంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన ఆయనకు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.