News June 11, 2024

రాయదుర్గం: రూ.50వేల నాణాలతో జంబుకేశ్వరుడి అలంకరణ

image

రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం భక్తులకు ప్రత్యేక అలంకరణలో కనివిందు చేశారు. రూ.50వేలు విలువచేసే నాణేలతో స్వామి మూలవిరాట్‌ని అలంకరించారు. పురోహితుల రామకృష్ణ స్వామి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామి వారి విశేష అలంకరణను దర్శించుటకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

Similar News

News February 23, 2026

సజావుగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ ఆనంద్

image

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. నగరంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫర్ గర్ల్స్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, మెడికల్ క్యాంపు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ వెల్లడించారు.

News February 23, 2026

అనంత: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08554-277626) ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని కోరారు.