News June 11, 2024
రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలుడి మృతి

చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఉడేగోళానికి చెందిన పదో తరగతి చదువుతున్న చరణ్‌ను రెండు నెలల కిందట రాయదుర్గం మండలం 74 ఉడేగోళం వద్ద ఉన్న హైవేపై రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబీకులు బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 18, 2025
సవిత షటిల్.. పరిటాల సునీత క్యారమ్స్

విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో నేటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్‌లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్‌లో ఆడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత తన పేరును నమోదు చేసుకున్నారు. ఇక 100మీ పరుగు పందెంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పోటీ పడనున్నారు. విజేతలకు సీఎం బహుమతులు అందజేస్తారు.
News March 18, 2025
అనంత: మూడు నెలలకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి

అనంతపురం హార్టికల్చర్ కాంక్లేవ్‌లో చేసుకున్న ఎంవోయులకు సంబంధించి రాబోయే మూడు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం హార్టికల్చర్ కాంక్లేవ్‌లో వివిధ కంపెనీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లోగా రాబోయే మూడు నెలలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను అందజేయాలని ఆదేశించారు.
News March 17, 2025
JNTUA 14వ స్నాతకోత్సవానికి నోటిఫికేషన్ విడుదల

అనంతపురం జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి 2023-24 మధ్య కాలంలో యూజీ (లేదా) పీజీ (లేదా) పీహెచ్డీ పూర్తి చేసుకున్నవారు తమ ఒరిజినల్ డిగ్రీలకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు https://jntuaebranchpayment.in/originaldegree/ ను సందర్శించాలని సూచించారు.