News March 14, 2025

రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

image

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.

Similar News

News March 15, 2025

సంగెం: రోడ్డు ప్రమాదం.. మేస్త్రీ మృతి

image

సంగెం మండలం తిమ్మాపురం సబ్ <<15757117>>స్టేషన్ <<>>వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. ప్రకాశం (D) జిగురుమల్లికి చెందిన బంగారు బాబు(34) కుటుంబంతో సంగెం(M)కి వలస వచ్చాడు. మేస్త్రీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పని కోసం వెళ్తున్న బాబు, మణికంఠ బైక్‌ను బొలెరో ఢీకొట్టింది. చికిత్స కోసం 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో బాబు మృతిచెందాడు. కేసు నమోదైంది.

News March 15, 2025

వరంగల్: నేటీ నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

image

రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేల అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తరహాలోనే శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నడపాలని మంత్రి సూచించారు.

News March 14, 2025

వరంగల్: హోలీ వేడుకల్లో కలెక్టర్ శారద

image

టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలలో కలెక్టర్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు.

error: Content is protected !!