News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.
Similar News
News December 7, 2025
బోర్లు ఇంటికి ఏ దిశలో ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. బోర్లు ఇంటి ప్రాంగణంలో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశలో ఉండటం శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అలా సాధ్యంకాని పక్షంలో కనీసం తూర్పు, ఉత్తర దిక్కులలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు. ఈ నియమాలు పాటించేవారికి అదృష్టం, అభివృద్ధి, సంపద, ఆరోగ్యం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని, వాస్తుకు సంబంధించి దోషాలు కలగవని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 7, 2025
SVUలో అధిక ఫీజులు.. అయినా.!

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో MBA, MCA, PG సెమిస్టర్ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇతర యూనివర్సిటీల్లో రూ.1500లోపు సెమిస్టర్ ఫీజులు ఉండగా.. SVUలో మాత్రం రూ.4వేల వరకు ఉందట. ఇంత ఫీజులు కడుతున్నా సరైన సమయంలో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేయడం లేదంటూ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News December 7, 2025
శ్రీకృష్ణుని విగ్రహంతో యువతి వివాహం

శ్రీకృష్ణుని మీద భక్తితో ఓ యువతి ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకుంది. యూపీలోని బదాయు(D) బ్యోర్ కాశీమాబాద్కు చెందిన పింకీ శర్మ(28) కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దగ్గరుండి జరిపించారు. పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ జరిగిన సంగతి తెలిసిందే.


