News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.
Similar News
News March 6, 2026
HYD: మీ గుడి నుంచి పూజలు.. రూ.50 వేల ఆదాయం

ప్రముఖ ఆధ్యాత్మిక ప్లాట్‌ఫాం వేదమందిర్‌కు సేవలందించేందుకు పురోహితులు కావలెను. మీ ప్రాంతంలోనే ఉండి, మీ దైనందిన కార్యక్రమాలు చూసుకుంటూనే మా కస్టమర్లకు సేవలు అందించవచ్చు. దీంతో మీరు నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు పొందుతారు. ఆసక్తి గల పురోహితులు <
News March 6, 2026
జడ్పీ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాలకే!

ఏపీలోని 2021లో జిల్లాల పునర్విభజన జరగక మొత్తం 13 జిల్లాలోని మండలాలకు జడ్పీ ఎన్నికలు జరిగాయి. అనంతరం 2022లో 26 జిల్లాలుగా YCP ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2024లో అధికారంలోకొచ్చిన కూటమి ఇటీవల 26ను..28 జిల్లాలుగా మార్చింది. గతంలో పాత జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు ఉమ్మడి శ్రీకాకుళంలోని పది నియోజకవర్గాల్లో జరిగాయి. ప్రస్తుతం 8 నియోజకవర్గాలకు జడ్పీ ఎన్నికలు జరిపేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
News March 6, 2026
ములుగు జిల్లా యువకుడికి సివిల్స్ ర్యాంక్

కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ నిరూపించారు. ఇటీవల గ్రూప్-1 పరీక్షల్లో 105వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికైన ఆయన, నేడు విడుదలైన UPSC సివిల్స్ ఫలితాల్లో 793వ ర్యాంక్ సాధించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్‌ను పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఆయన నానమ్మ పెంచారు. ప్రవీణ్ విజయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


