News March 12, 2025
రాయపర్తి: మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సందర్శించిన కలెక్టర్

మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..1/2 సాగునీటి తీరును క్షేత్రస్థాయిలో అధికారులు కలిసి పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు సాగునీరు అందించేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 16, 2025
వరంగల్ అమ్మాయితో అమెరికా అబ్బాయి మ్యారేజ్❤️

వరంగల్‌కు చెందిన అమ్మాయితో అమెరికాకు చెందిన అబ్బాయికి ఆదివారం పెళ్లి జరగనుంది. కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ సంపత్- పద్మ దంపతుల రెండో కూతురు సుప్రియ ఐదేళ్ల క్రితం పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. అదే కాలేజీలో చదువుతున్న గ్రాండ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో గ్రాండ్ తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. వీరి పెళ్లి వరంగల్‌లో నేడు జరగనుంది.
News March 16, 2025
వరంగల్: రైలు కింద పడి వ్యక్తి మృతి

వ్యవసాయ పనులు చేసుకుని వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. శాయంపేట గ్రామానికి చెందిన రాజేందర్ (33) చింతలపల్లి రైల్వే స్టేషన్ పక్కన గల మొక్కజొన్న చేనుకు వద్దకు వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. శవపరీక్ష అనంతరం శవాన్ని మృతుడి తండ్రి ఐలయ్యకు అప్పగించినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.
News March 16, 2025
ఈవీఎం మిషన్లు తనిఖీలు చేసిన వరంగల్ కలెక్టర్

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా వేర్ హౌస్ గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలెక్టర్ సత్య శారదా దేవి వివిధ పార్టీ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి తనిఖీలు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.