News February 17, 2025
రాయపోల్: గొప్ప మనసు చాటుకున్న నాగేంద్ర కుటుంబీకులు

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఆరెపల్లి(ఎస్జే) గ్రామానికి చెందిన కొంపల్లి నాగేంద్రకు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్తో మృతి చెందాడు. కాగా ఇంత దుఃఖంలోనూ వారి కుటుంబ సభ్యులు నాగేంద్ర అవయవాలు దానం చేసి గొప్ప మనస్సు చాటుకున్నారు. ఈ విషయం తెలిసి పలువురు వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని అభినందిస్తున్నారు.
Similar News
News December 2, 2025
నల్గొండ: ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్కు నోచుకోని గ్రామాలు!

నల్గొండ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో స్థానిక సర్పంచ్ ఎన్నికలకు ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నా రిజర్వేషన్ రాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నార్కెట్పల్లి, నిడమనూర్, గుండ్రంపల్లి, వెలిమనేడు, పెద్ద కాపార్తి, పెద్దదేవులపల్లి, ముత్యాలమ్మ గూడెం, చందంపేట, పులిచెర్ల, దాచారం , అంగడిపేట, వీర్లపాలెం, పగిడిమర్రి, కొండూరు, ఎర్రగండ్లపల్లి ఇలా దాదాపు 27 పంచాయతీలకు ఒక్కసారి కూడా సర్పంచ్ SC రిజర్వ్ కాలేదు.
News December 2, 2025
ఈజీ మనీ ఆశ ప్రమాదం: వరంగల్ పోలీసుల హెచ్చరిక

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని వరంగల్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫ్రీ గిఫ్ట్స్, భారీ డిస్కౌంట్స్ పేరుతో ఎర వేసి మీ ఖాతాలు ఖాళీ చేస్తారని హెచ్చరించారు. ఉచితం అనగానే ఆశపడకుండా ఒక్క క్షణం ఆలోచించాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచించారు.
News December 2, 2025
ఏలూరు: ‘గృహ నిర్మాణానికి దరఖాస్తు పొడిగింపు’

ఏలూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఇంటి నిర్మాణ దరఖాస్తుకు గడువు పొడిగించడం జరిగిందని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆవాస్ ప్లస్ 2024 సర్వే పూర్తి చేయడానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అదనంగా డిసెంబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించడం జరిగిందన్నారు. స్థలం ఉండి ఇల్లు లేని వారు, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


