News February 17, 2025

రాయపోల్: గొప్ప మనసు చాటుకున్న నాగేంద్ర కుటుంబీకులు

image

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఆరెపల్లి(ఎస్జే) గ్రామానికి చెందిన కొంపల్లి నాగేంద్రకు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందాడు. కాగా ఇంత దుఃఖంలోనూ వారి కుటుంబ సభ్యులు నాగేంద్ర అవయవాలు దానం చేసి గొప్ప మనస్సు చాటుకున్నారు. ఈ విషయం తెలిసి పలువురు వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని అభినందిస్తున్నారు.

Similar News

News March 24, 2025

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం సోమవారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి, భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబంది, భక్తులు ఉన్నారు.

News March 24, 2025

ఎన్టీఆర్: అమరావతిలో సిద్ధమవుతున్న బేస్ క్యాంపులు 

image

రాజధాని అమరావతి పనులు ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు గుత్తేదారు సంస్థలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవల విజయవాడలోని CRDA కార్యాలయంలో రూ.22,607.11కోట్ల పనులకు సంబంధించి లెటర్ ఆయా యాక్సెప్టెన్స్(LOA)ను గుత్తేదారులకు అందజేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు ప్రారంభం కాగానే ఆయా సంస్థలు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 

News March 24, 2025

ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు

image

TG: 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లకు 5 చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నాటికి వీటిని స్కూళ్లలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈనెల 15 నుంచి ప్రయోగాత్మకంగా 513 స్కూళ్లలో AI టూల్స్‌ను వినియోగిస్తూ ఇంగ్లిష్, మ్యాథ్స్ పాఠాలను బోధిస్తున్నారు. 25-26 విద్యా సంవత్సరంలో మరిన్ని స్కూళ్లలో దీనిని అమలు చేయనున్నారు.

error: Content is protected !!